సట్టా నడుపుతున్న మహిళ అరెస్టు

WGL: సట్టా నడుపుతున్న మహిళను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు క్రిస్టియన్ కాలనీలో సట్టా నడుపుతుండగా మహిళను పట్టుకున్నారు. తన వద్ద నుంచి రూ.5,220 నగదు, స్లిప్స్, మొబైల్ ఫోన్ స్వాధీనపర్చుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.