హెచ్‌సీఎ కొత్త కార్యదర్శిగా జీవన్ రెడ్డి
TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కొత్త కార్యదర్శిగా ఎం జీవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 15న కార్యదర్శి పదవికి ఎన్నికలు జరగాలి. అయితే, జీవన్ రెడ్డితోపాటు ఈ పదవికి నామినేషన్ వేసిన మరో నలుగురు తప్పుకున్నారు. చిట్టి శ్రీధర్, అనిల్, హరినారాయణ, బాబూరావు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో జీవన్ రెడ్డికి పోటీ లేకుండా పోయింది.