VIRAL: 'హీరో ఆఫ్ హ్యుమానిటీ'కి సన్మానం

VIRAL: 'హీరో ఆఫ్ హ్యుమానిటీ'కి సన్మానం

పహల్గామ్ ఉగ్రదాడిలో నజాకత్ అలీ అనే యువకుడు కొందరు పర్యాటకుల ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఛత్తీస్‌గడ్‌లోని చిరిమిరి ప్రాంతానికి వెళ్లగా అక్కడి ప్రజలు ఘనంగా సన్మానించారు. ఏటా చలికాలం ఉన్ని దుస్తులు అమ్మేందుకు వచ్చే నజాకత్‌కు ఈసారి స్థానికులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఆయన వీరత్వాన్ని ప్రశంసిస్తూ 'హీరో ఆఫ్ హ్యుమానిటీ' అని కొనియాడారు.