చేప ధర తెలిస్తే షాక్ అవుతారు..! 

చేప ధర తెలిస్తే షాక్ అవుతారు..! 

E.G: అంతర్వేది మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో బంగారు చేప ధర వామ్మో అనిపిస్తోంది. జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లగా 2 బంగారు చేపలు వలకు చిక్కాయి. వీటిని హార్బర్‌కు తీసుకొచ్చి వేలం వేయగా ఒక చేప రూ.1.20లక్షలు, మరొకటి రూ.74 వేలకు స్థానికులు కొనుగోలు చేశారు. చేపల పొట్ట భాగం ఔషధాలకు, శస్త్రచికిత్సలో వాడే దారం తయారీకి, మాంసం వంటకానికి వినియోగిస్తారు.