బాలోత్సవంలో పాల్గొన్న తుడా ఛైర్మన్
తిరుపతి: ఎస్.జి.ఎస్ ఆర్ట్స్ కాలేజ్లో జరిగిన బాలోత్సవం-4వ పిల్లల పండుగ 2025లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసించిన ఆయన, ఇలాంటి స్ఫూర్తిదాయక వేదికలు మరిన్ని ఉండాలన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యా అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు.