దుబాయ్‌లో సిద్దిపేట వాసి మృతి

SDPT: సిద్దిపేట జిల్లా, బెజ్జంకి గ్రామ పంచాయతీ పరిధిలోని పాపన్నపల్లె గ్రామానికి చెందిన ఉమ్మడి రామచంద్రాచారి (47) అనే వ్యక్తి శుక్రవారం దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. బ్రతుకుతెరువు కోసం స్వగ్రామం నుంచి వలస వెళ్లిన రామచంద్రం గత 16 ఏళ్లుగా గల్ఫ్ దేశమైన దుబాయ్‌లో పనిచేస్తూ.. కుటుంబ భవిష్యత్తు కోసం కలలు కంటూ కష్టపడుతున్నాడు.