ఆగష్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

ఆగష్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 30న శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.