శ్రీ దుర్గాదేవి ఆలయంలో దొంగతనం

శ్రీ దుర్గాదేవి ఆలయంలో దొంగతనం

VZM: కొత్తవలస విశాఖ ప్రధాన రహదారి అనుకొని ఉన్న శ్రీదుర్గాదేవి గుడిలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. బుధవారం ఉదయం ఆలయ అర్చకుడు వచ్చి చూసేసరికి తాళాలు తీసి ఉన్నాయి. గమనించిన ఆలయ అర్చకుడు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. సీఐ షణ్ముఖరావు, సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు రేకులు విరగొట్టి లోనికి ప్రవేశించినట్లు నిర్ధారణలో తేలింది.