VIDEO: వృథాగా పోతున్న నీరు.. పట్టించుకోని అధికారులు..!
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామ సచివాలయం సమీపంలో తాగునీటి పైపు పగిలి నీరు వృథాగా పోతోంది. గత 5 నెలలుగా వృథాగా నీరు ప్రవహిస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైపు మరమ్మతు పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.