‘రైతు సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సు’

కృష్ణా: రైతుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ముడా డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తెలిపారు. బుధవారం అవనిగడ్డ మండల పరిధిలోని దక్షిణ చిరువోలు లంక గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మావతి మాట్లాడుతూ పొలం సరిహద్దులు, పేర్ల మార్పులకు సంబంధించి, ఇతర సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చునని రైతులకు సూచించారు.