VIDEO: అధ్వానంగా నడ్డంగూడ-సుంగాపూర్ రోడ్డు
ADB: నార్నూర్ మండలంలోని నడ్డంగూడ నుంచి సుంగాపూర్ గ్రామానికి వెళ్లే సుమారు 7 కిలోమీటర్ల రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. వివిధ పనుల కోసం నిత్యం మండల కేంద్రానికి వచ్చే మారుమూల గ్రామ ప్రజలు ఈ రోడ్డుతో నానా అవస్థలు పడుతున్నారు. కనీసం అంబులెన్సు వెళ్లాలంటే కఠినంగా మారిందని, 10 నిముషాలు పట్టె రోడ్డుకు 30 నిమిషాల వరకు ప్రయాణం అవుతుందని వారు వాపోయారు.