డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NLG: హలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దోస్త్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఘన శ్యామ్ తెలిపారు. విద్యార్థులు ఈనెల 15,16 తేదీల్లో హాలియాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. కళాశాలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలలో సమర్పించాలని తెలిపారు.