తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన గీత కార్మికుడు

జనగామ: లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామంలో నేడు తేనెటీగల దాడిలో గీత కార్మికుడు బసవగాని అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. కల్లు కోసం తాటి చెట్టు ఎక్కుతుండగా కార్మికుడిపై తేనెటీగలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అశోక్‌ను వెంటనే సహచర కార్మికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య పరామర్శించారు.