VIDEO: నీలగిరి తోటలో చెలరేగిన మంటలు

పుంగనూరు మండల పరిధిలోని దండుపాళ్యం గ్రామ సమీపంలో వై.రెడ్డి భాస్కర్ గుప్తకు చెందిన నీలగిరి తోటలో శుక్రవారం మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు ఘటన స్థలానికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.30,000ల పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది.