తేనెటీగల దాడి చేయడంతో వ్యక్తి మృతి

NLG: నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తేనెటీగల దాడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామంలో ఈరోజు తేనెటీగలు దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ పిడుగు ప్రభాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు.