తనిఖీలు నిర్వహించిన పోలీసులు..!
NRML: ముథోల్ మండలం నర్సాపూర్ జి కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో స్థానిక ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని, హెల్మెట్ ధరించని 28 వాహనాలపై జరిమానా విధించారు. మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.