ఫైనల్‌లో తడబడిన టీమిండియా.. అయినా!

ఫైనల్‌లో తడబడిన టీమిండియా.. అయినా!

ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో అజేయంగా రాణించిన భారత హాకీ జట్టు తుదిపోరులో తడబడింది. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో తుదిపోరులో 0-2తో ఓడింది. దీంతో క్వాలిఫయర్స్ టోర్నీలో 2వ స్థానంలో నిలిచినా.. ఈ ఏడాది బెల్జియం-నెదర్లాండ్స్‌లో జరిగే హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. అటు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్.. మూడో స్థానంలో ఉన్న స్కాట్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి.