'నూతన గనులతో పూర్వ వైభవం తీసుకురావాలి'

MNCL: నూతన గనుల ఏర్పాటుతో మందమర్రి ఏరియాకు పూర్వ వైభవం తీసుకురావాలని హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ కోరారు. నూతన జీఎం రాధాకృష్ణను మంగళవారం ఆయన స్థానిక నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్కే ఓసీ, శ్రావణపల్లి ఓసీ, కేకే 6 గనులు త్వరితగతిన వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.