VIDEO: 'లంచం అడిగితే ఎగిరి తన్నండి'
KRNL: ఆదోనిలోని హనుమాన్ నగర్‌లో మంగళవారం ఎమ్మెల్యే పార్థసారథి పర్యటించారు. తాగునీటి పైపులైను ఏర్పాటుకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త నాగరాజు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారని బాధితులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ లంచం అడిగే వారిని ‘ఎగిరి తన్నాలని' మహిళలకు సూచించారు.