వైసీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని 6, 7, 8 వార్డుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఇన్‌ఛార్జి కంభం విజయరాజు రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ప్రజల నుంచి ఆయన సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందదని తెలిపారు.