తాగునీటి బోరు మరమ్మతులు చేపట్టాలి

ASR: పాడేరు మండలంలోని బక్కలపనుకు గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామంలో ఉన్న తాగునీటి బోరు మరమ్మతులకు గురైందని అన్నారు. దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.