రాయదుర్గం మాస్టర్ ప్లాన్‌పై అవగాహన
ATP: రాయదుర్గం నగరానికి సంబంధించి తయారుచేసిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై అహుడా ప్లానింగ్ ఆఫీసర్ ఇసాక్, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి విస్తృత అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో సచివాలయ సిబ్బంది, వీఆర్‌వో అడ్మిన్‌లతో సమావేశం నిర్వహించారు. ఓసారి మాస్టర్ ప్లాన్ పరిశీలించి సిబ్బంది, ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 లోపు తెలియజేయలన్నారు.