ఖమ్మంలో తెలంగాణ బడ్జెట్ ప్రతులు దగ్ధం

ఖమ్మంలో తెలంగాణ బడ్జెట్ ప్రతులు దగ్ధం

KMM: తెలంగాణ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ శనివారం ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో విద్యారంగంపై చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. ప్రసంగంలో తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు.