VIDEO: హిల్ వ్యూ స్టేడియంలో సాయి నామస్మరణ
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు సాయి నామస్మరణ చేశారు. బాబాను గుర్తు చేసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.