జిల్లా వ్యాప్తంగా 'బడిబాట' కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా 'బడిబాట' కార్యక్రమం

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో ఆయా గ్రామాలలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు.