అగ్ని ప్రమాదం.. డ్రైవర్ సజీవదహనం

HYD: హైదరాబాద్ శివారులోని కాజిపల్లిలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. కంకరను అన్‌లోడ్ చేస్తున్న టిప్పర్‌కు కరెంట్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. హైడ్రాలిక్‌కు కరెంట్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.