'అక్రమ అరెస్టును అందరూ ఖండించాలి'

'అక్రమ అరెస్టును అందరూ ఖండించాలి'

ASR: మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డా.భైరి నరేష్ అక్రమ అరెస్టును అందరూ ఖండించాలని ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, జిల్లా మహిళా కార్యదర్శి వసంతకుమారి, పాడేరు మండల అధ్యక్షుడు చిన్నయ్య కోరారు. ఆదివారం పాడేరులో ఎంఎన్ఎస్ సభ్యులు దయారావు, అచ్చిరాజు నిరసన తెలిపారు. మూఢనమ్మకాలకు దూరంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్న నరేష్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.