NGO's కాలనీ రూపశిల్పి విగ్రహావిష్కరణ
GNTR: NGO's కాలనీ రూపశిల్పి డి.వెలుగొండయ్య విగ్రహావిష్కరణ ఇవాళ పట్టాభిపురంలో జరిగింది. ప్రముఖులు బొడ్డపాటి సామిరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షుడు రత్నసాగర్, కార్యదర్శి రామకృష్ణ, పార్క్ అధ్యక్షురాలు సుబ్బాయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు వక్తలు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.