పూర్వ వైభవం రావాలంటే నియోజకవర్గం చేయాల్సిందే..!

పూర్వ వైభవం రావాలంటే నియోజకవర్గం చేయాల్సిందే..!

MDK: రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే దానిని తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు డిమాండ్ చేశారు. 2009లో నియోజకవర్గ హోదా కోల్పోవడం వల్ల ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, రాబోయే 2026 డీలిమిటేషన్‌లో రామాయంపేటను ఖచ్చితంగా నియోజకవర్గంగా చేర్చాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత, తదితరులు పాల్గొన్నారు.