కడప జిల్లాలో 'ఫేస్ వాష్ అండ్ గో'
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు 'ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున జిల్లాలోని రహదారులపై ప్రమాదకరమైన 'బ్లాక్ స్పాట్స్' గుర్తించి, అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణించే లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను ఆపి, వారికి స్వయంగా నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు.