బైరెడ్డికి జనసేన నేత నాగేంద్ర హెచ్చరిక
NDL: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదివారం ఆళ్లగడ్డ జనసేన నేత సజ్జల నాగేంద్ర ఖండించారు. చేతనైతే కరవు సీమలో కన్నీళ్లు తుడిచే పనులు చేయాలని బైరెడ్డికి సూచించారు. విలువలతో కూడిన రాజకీయం మీలాంటి ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకు అర్థం కాదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే సహించబోమన్నారు.