'బొందలవాడ అభివృద్ధికి నిధులు కేటాయించాలి'
ATP: నార్పల మండలం బొందలవాడ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ఆలం శిరీష, ఉపసర్పంచ్ వెంకట నరసానాయుడు బుధవారం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కోరారు. గ్రామంలో అత్యవసరంగా ఓపెన్ జిమ్, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. విద్యా, వైద్య రంగాలు, శ్మశాన వాటిక మెరుగుపరచాల్సిన అవసరముందని వివరించారు.