ఉపాధ్యాయుడు మృతి.. ఎమ్మెల్యే జారే నివాళి

BDK: అశ్వారావుపేట మండలం బండారుగుంపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ధారబోయిన ప్రసాద్ అనారోగ్య సమస్యతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రసాద్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.