వేణుగోపాల్ మూర్తి తీరని లోటు: కోటిరెడ్డి, భగత్ కుమార్

NLG: గుర్రంపోడ్ మండలం కోయిగూరోనిబావి మాజీ ఎంపీటీసీ పురం వేణుగోపాల్ అకాల మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. సోమవారం వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.