రైతు దారుణ హత్య

రైతు దారుణ హత్య

CTR: పాత కక్షల నేపథ్యంలో రైతు దారుణ హత్యకు గురైన ఘటన పుంగనూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కృష్ణాపురానికి చెందిన వెంకటరమణకు రామకృష్ణతో పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వెంకటరమణ కొడవలితో రోడ్డుపై ఉన్న రామకృష్ణ(55), అతని కుమారుడు సురేష్‌పై దాడి చేశాడు. రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.