రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరెస్ట్

రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరెస్ట్

NLR: రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను అద్దంకి టోల్ గేట్ సమీపంలో అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నెల్లూరు నుంచి కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో నేడు ఆమెను కోర్టులో హాజరు పరుచనున్నారు. 4 రోజుల క్రితం CIకి ఫోన్ చేసి హోం శాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ అరుణ బెదిరింపులకు పాల్పడ్డారు.