అమెరికాకు రూ.923కోట్ల విలువైన బంగారం
వెనిజులా నుంచి అమెరికాకు రూ.923 కోట్లు విలువైన బంగారం వచ్చింది. ఈ విషయాన్ని యూఎస్ హోంమంత్రి డగ్ బర్గమ్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇంకా ఆ దేశంలో 500 బిలియన్ డాలర్ల విలువైన బంగారం వనరులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కాగా, వెనిజులా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగారం మైనింగ్ కంపెనీ మినర్వెన్‌తో లావాదేవీలకు అనుమతిస్తూ అమెరికా ఇప్పటికే లైసెన్స్ జారీ చేసింది.