రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

NRPT: నర్వ మండలం లక్కర్ దొడ్డిలో సర్పంచ్ సుశీలమ్మ ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కానిస్టేబుల్ మొగిలప్ప 'అరైవ్-అలైవ్' కార్యక్రమం చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.