మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

కర్నూలు: జిల్లాలో 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం ప్రముఖ న్యాయవాది జి. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో సాధన చేస్తే భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా రాణించవచ్చని.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు విద్యా, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.