బాధితుడికి ఎల్వోసీ అందజేసిన.. ఎమ్మెల్యే గండ్ర

BHPL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుడు గణేశ్‌కు రూ.7 లక్షల విలువైన ఎల్వోసీ చెక్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేదలు నిమ్స్‌లో చికిత్స పొంది, ఎస్టిమేషన్ కాపీతో వస్తే ప్రభుత్వం ఎల్వోసీ చెక్కులు ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గణేశ్ కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.