సేవా టికెట్ల జారీ.. మరింత పక్కాగా

TPT: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి సేవా టికెట్ల కేటాయింపులో కొత్తగా మార్పులు తెచ్చారు. తిరుమల తరహాలో జారీ విధానానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తరహాలోనే శ్రీపద్మావతీ అమ్మవారికి అనేక నిత్య, వారపు సేవలు నిర్వహిస్తుంటారు. ఇటీవల అమ్మవారి అభిషేకం, తిరుప్పావై, వీఐపీ బ్రేకుకు డిమాండ్ ఏర్పడింది.