విద్యార్థుల తల్లిదండ్రులకు వేపరాల HM హామీ

KDP: వేపరాల ZPHS HM తన సిబ్బందితో కలిసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను తల్లిదండ్రులు చేర్పించేలా అవగాహన కల్పిస్తూ క్యాంపెయిన్ చేపట్టారు. మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. పదో తరగతి ఫలితాలలో వేపరాల హైస్కూల్‌లో ఫస్ట్ వచ్చిన విదార్థులకు ఐఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. సీటు వచ్చిన తర్వాత వారికి నెలకు రూ. 50 వేల కన్నా తక్కువ జీతం వస్తే నా జీతంలో ఇస్తాను అని చెప్పారు.