తాగునీటికి భూమి పూజ చేసిన ఛైర్మన్
NDL: నంది కోట్కూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి కోసం మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపి నిధులు రూ. 10 లక్షలతో స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల తరఫున ఎంపీ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలిపారు.