డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని 15వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. వజ్రం డాబా వద్ద నుంచి సాయిరాం ఆటోమొబైల్స్ వరకు రూ. 25 లక్షల వ్యయంతో ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.