దొరమామిడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ శిబిరానికి గ్రామస్తులు వైద్య సేవలు పొందేందుకు హాజరయ్యారు. ఎజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రైవేట్ ఆసుపత్రిల సహకారం కోరుతున్నట్లు వెల్లడించారు.