DFO జోజికి కలెక్టర్ అభినందనలు
MDK: జిల్లా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ జోజి 2019 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో అటవీ శాఖను క్రమశిక్షణతో నడిపిస్తూ, ఉత్తమ పనితీరు కనబరుస్తున్న అలుపెరగని ఆణిముత్యం జోజి అని కలెక్టర్ కొనియాడారు. ఆయన కఠోర శ్రమ, నిబద్ధత ఇతర అధికారులకు స్ఫూర్తిదాయకమన్నారు.