'పౌర హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు'

'పౌర హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు'

NTR: పౌర హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు చేపడతామని గంపలగూడెం తహసీల్దార్ వడ్డేస్ వరకు రాజకుమారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం పడమట దళితవాడలో పౌర హక్కులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎక్కడైనా ఎవరైనా మీరు వేరు, మేము వేరు అనే భేదాలు తెస్తే తమ దృష్టికి తేవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట.పుల్లమ్మ ఎంపీడీవో టీ.సరస్వతి పాల్గొన్నారు.