రోడ్డుపై విరిగి పడిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

MDK: టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం ఈదురు గాలులకు రోడ్డుపై చెట్టు విరిగిపడింది. దీంతో ఎల్లంపల్లి నుంచి మెదక్ వెళ్లే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చెట్టును తొలగించి వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.