VIDEO: రోడ్డుపై గుంత.. రాకపోకలకు ఇబ్బందులు
CTR: పలమనేరు మున్సిపాలిటీ పాతపేట పోస్ట్ ఆఫీస్ సమీపంలో రోడ్డుపై గుంత ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డు కింద ఉన్న రాజు కాలువ కుంగిపోయి పెద్ద గుంత ఏర్పాటుతో స్థానికులు గుంత చుట్టూ రాళ్లు, జెండాలు పెట్టి వాహనదారులకు ప్రమాదం జరగకుండా చూస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మెత్తబడి కుంగిపోయినట్లు స్థానికులు తెలిపారు.