వెలగపూడిలో భారీ అగ్ని ప్రమాదం

వెలగపూడిలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లా వెలగపూడి N-9 జంక్షన్ సమీపంలో ఉన్న L&T వద్ద బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పైపులు అకస్మాత్తుగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం వలన చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.